Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 8:22 pm Posted by : ramakrishna

ముగిసిన లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బీర్కూరు మండలం లోని తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం చివరిరోజు సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీవారు పుష్కరీలో చక్రస్నానం చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి – పుష్ప దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భారీ ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.

The Brahmotsavams of Lord Venkateswara along with Lakshmi Goda have concluded.