బాలుడి మృతదేహం లభ్యం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డు పక్కన  గల చెత్త కుప్పలో బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి తలపై కొట్టి చంపినట్లుగా గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.