Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 7:51 pm Posted by : ramakrishna

బాలుడి మృతదేహం లభ్యం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యమయింది. మృతి చెందిన బాలుడికి సుమారు రెండు సంవత్సరాలు ఉంటుంది. స్థానికుల సమాచారం తో సంఘటన స్థలానికి మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు, నగర సీఐ శ్రీనివాసరాజ్ చేరుకున్నారు.

The boy's body was found.

ఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న బండతో కొట్టి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అసలు బాలుడిని ఎవరు తీసుకువచ్చి చంపి ఉంటారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా విభజించి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్టు నగర సిఐ శ్రీనివాసరాజ్ తెలిపారు.

The boy's body was found.