Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 4:17 pm Posted by : ramakrishna

మెడికల్ కాలేజికీ మృతదేహం అప్పగింత

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ గ్రామానికి చెందిన తిరుపతి కమల అనే మహిళా అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కు,  కళ్ళను కూడా లయన్స్ హాస్పిటల్ కు నేత్రదానం చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భర్త గుర్ల గోపి స్వర్ణలత, చిన్న కూతురు నాయిని హేమలత,  నాయిని కృష్ణ ఆమె బ్రతికున్న సమయంలో కూతుర్లు, అల్లుళ్లకు నేను చనిపోయిన తర్వాత నా యొక్క మృతదేహాన్ని మెడికల్ కాలేజ్ కు అప్పగించాలని కోరడంతో వారి కోరిక మేరకు  మృతదేహాన్ని మెడికల్ కాలేజ్ కు,  నేత్రాలను లైన్స్ ఆసుపత్రి వారికి దానం చేయడం జరిగిందని వారు తెలియజేశారు. లయన్స్ క్లబ్స్ ఆచన్ పల్లి, రుద్రూర్, భవాని సభ్యులు, రాష్ట్ర అవయవ దాన అధ్యక్షురాలు  కాట్రగడ్డ భారతి, శ్రీలక్ష్మి లు పాల్గొని మెడికల్ కాలేజ్ కు మృతదేహాన్ని అప్పగించడానికి కావాల్సిన పత్రాలను జత చేసి మృతదేహాన్ని అప్పగించారు. ఈ సందర్బంగా కాట్రగడ్డ భారతి మాట్లాడుతూ.. ఆమె కోరిక మేరకు కుటుంబసభ్యులు మృతదేహన్ని మెడికల్ కాలేజకీ, కళ్ళను లయన్స్ హాస్పిటల్ వారికీ దానం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. వారు దానం చేసిన మృతదేహం, కళ్ళు వేరే వారికీ ఉపయోగపడతాయాంటే ఆమె ఇంకా మనలో బ్రతికి వున్నట్టే అని ఈ అవాగాహన అందరికి రావాలని మృతదేహాన్ని అప్పగించిన కుటుంబ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.