Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2025, 4:14 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య

  • ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన బోధన సిబ్బంది ఉండడం మూలన ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పల్లికొండ ప్రభుత్వ ప్రాథమికొన్నత,ఉన్నత పాఠశాల ల్లో నిర్వహించిన బాధిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  పల్లి కొండ జడ్పిఎచ్ ఎస్ ప్రాథమిక పాఠశాల జిల్లాలోను ఇటు మండలంలోను ఆదర్శ పాఠశాలలని, దాదాపు 350 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని గ్రామాల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన గ్రామస్థులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని, ఉచితంగా ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు,మధ్యాహ్న భోజనం అమలు చేసి అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏపీఎం రవీందర్, సీసీలు  నరేష్,లలిత,  రాజేందర్,  పాఠశాల హెచ్ఎం,ఉపాధ్యాయులు, మహిళా సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

The best education is in government schools.