బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం
ఇందూర్, బతుకమ్మ : కేంద్రం చేపడుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగణన అంశం లేకపోవడాన్ని నిరసిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షకు పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పులాంగ్ చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ ప్రజలు బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీ కులగణనను చేపడతామని కేంద్ర...