Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 5:45 pm Posted by : ramakrishna

బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి

రుద్రూర్, బతుకమ్మ : బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా బీసీ డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఓ. సతీష్, బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రశాంత్ గౌడ్, ఏముల గజేందర్, బి.వినోద్ తదితరులు ఉన్నారు.