నిజామాబాద్ క్రైం ,బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యావర్గపు పదవీకాలం మార్చి 31 పూర్తి అవుతున్న నేపథ్యంలో బార్ ఎన్నికల నిర్వహణ కుగాను సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్ చైర్మన్ గా,మరో ముగ్గురు సీనియర్ న్యాయవాదులు బాస రాజేశ్వర్,జి. నర్సింహారెడ్డి, శ్రీహరి ఆచార్య సభ్యులు గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శి వి.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. న్యాయవాదుల ఓటరు జాబితాతో పాటు ,2025-2026 వార్షిక ఎన్నికల షెడ్యూల్ పంపించారు.
- “బార్ కౌన్సిల్ లే సుప్రీం”..
అడ్వొకేట్స్ ఆక్ట్ ప్రకారం దేశంలోని బార్ కౌన్సిల్ లే సుప్రీం అని చట్టం చెబుతున్నది.జిల్లాలో, మండల కేద్రాలలోని అన్ని బార్ అసోసియేషన్ లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్ చట్ట ప్రకారం అధికారికాయుతమైనవి.వాటి ఉత్తర్వుల మేరకు అన్ని బార్ అసోసియేషన్ లు తమ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.
- “నేడు అడ్ హాక్ కమిటీ సమావేశం”.
సీనియర్ న్యాయవాది ,మాజీ బార్ అధ్యక్షుడు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల రమేష్ అడ్ హాక్ కమిటీ చైర్మన్ గా,సీనియర్ న్యాయవాదులు బాస రాజేశ్వర్,జి.నరసింహారెడ్డి, శ్రీహరి ఆచార్య సబ్యులు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసుకుని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల విధివిధానాలను ప్రకటించనున్నారు.