వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటికిటలాడిన బాలాజీ ఆలయం
బోధన్, బతుకమ్మ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ప్రధాన రహదారిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల బాలాజీ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలం నుండే స్వామివారికి సుప్రభాత సేవలు, అభిషేకాలు, గోవింద నామ సోత్రాలతో అర్చనలు, మంగళ నిరాజనాలు నిర్వహించారు. నేడు ఉత్తర ద్వారం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ప్రాప్తం ఉంటుందని, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల సర్వ కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం....