Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2024, 4:32 pm Posted by : ramakrishna

అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి

  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
  • ప్రజావాణికి 84 ఫిర్యాదులు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

The authorities should resolve the applications promptly