Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 12:27 pm Posted by : ramakrishna

ఆశ్రమానికి నిప్పు పెట్టిన అగంతకులు

మోపాల్ మండలంలో ఘటన

మోపాల్, బతుకమ్మ : ఆశ్రమానికి అగంతకులు నిప్పు పెట్టారు.ఈఘటన మోపాల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సిర్పూర్ గ్రామ శివారులోని 62 సర్వే నంబర్ లో అవధూత నిర్మాణానంద స్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈఆశ్రమానికి గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి నిప్పు పెట్టారు. ఈ సంఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత భూమి కబ్జా కోసమే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


The assailants who set fire to the ashram