ఏర్గట్ల, బతుకమ్మ :జస్టిస్ ఆర్ గవాయి పై బూటు విసిరి దాడికి పాల్పడ్డ అడ్వకేట్ ను కఠినంగా శిక్షించాలని ఏర్గట్ల మండల దళిత బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం దళిత బహుజన సంఘాల నాయకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ గవాయి పై దాడికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలంటూ కోరుతూ తహసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దళిత బహుజన నాయకులు రాజేష్ రక్షక్,గన్నారపు రాజేశ్వర్, దిబ్బ సుదర్శన్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో ఏ న్యాయమూర్తి పైన దాడి జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ గవాయి దళిత బహుజన బిడ్డ కావడంతో ఆయనపై అహంకారంతో బూటు విసిరి దాడికి పాల్పడడం రాజ్యాంగం పైన దాడి జరిగినట్లేనని ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడు పైన దాడికి దాడి జరిగినట్లు వారు అన్నారు. దాడికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి దాడులు దేశంలో ఎక్కడ కూడా పునర్వృతం కాకుండా ప్రభుత్వాలు, న్యాయశాఖలు కఠిన చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శోభన్, జుంగల గణేష్,బోడా గణేష్,శేఖర్, అనిల్,యుగేందర్,సురేష్, భూమన్న,రాజన్న,తదితరులు పాల్గొన్నారు.