. . . యునివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి
డిచ్ పల్లి, బతుకమ్మ :
మహనీయుల ఆశయాలను మనం ఆచరించిన నాడే వారికి నిజమైన నివాళి అని యునివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఎస్సీ, ఎస్టీ సెల్ బీసీ సెల్, విమెన్ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలను యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న విద్యను సమాజ అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పదే విధంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాంబాబు, బీసీ సెల్ డైరెక్టర్, వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ జి వాణి, విమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
