తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ ప్రజల విరోచిత ఉద్యమంతో, త్యాగాలతో, బలిదానాలతో సాకారమైన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడానికి తెలంగాణ ఉద్యమ కారుల సంగం కృషి చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, మంతెన రాజేందర్ రెడ్డి కుమార్ దాస్, రాజ్ కుమార్ సుబేధార్, ఎమ్. ప్రకాష్ రెడ్డి, మధుసుధన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంగం రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన న్యాయవాది యెండల ప్రదీప్ ను జిల్లాకోర్టు సముదాయంలోని బార్...