Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 8:12 pm Posted by : ramakrishna

బిఆర్ఎస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం

  • భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామంలో పోడు రైతులకు మద్దతుగా నిలిచిన  బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్, బిఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతులకు మద్దతుగా నిలవడమే బిఆర్ఎస్ నేతలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం విచారకరమని, రైతులకు బేడీలు వేయడం, అక్రమ అరెస్టులు చేయడం ఇందిరమ్మ రాజ్యానికి తగని పని అని మండిపడ్డారు.కౌటాల పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన ప్రవీణ్‌కుమార్, ఇతర బిఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్య,సద్దాం, అనిల్ గౌడ్, వేణు, ఎస్.కె అప్రోచ్,ఎర్రబెల్లి జస్వంత్, మేకల సతీష్ తదితరులు పాల్గొన్నారు.