Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 4:11 pm Posted by : ramakrishna

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

-రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం కొనుగోలు చేయాలి

-ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన  దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తోగుట మండలంలోని వెంకట్రావుపేట, జప్తి లింగారెడ్డి పల్లి, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్ గ్రామాలలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తెలిపారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. ఇక భారతదేశానికి ఆనాడు రైతులకు లక్ష రుణమాఫీ,నేడు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానీదే అని, దేశానికే అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారుతుందని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని అధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు,కొనుగోలు కేంద్రాలు మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తుక్కాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి తాజా మాజీ ఎంపీపీలు గాంధారి లత నరేందర్ రెడ్డి, గంట రేణుక రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య, తాజా మాజీ సర్పంచులు పాగాల కొండల్ రెడ్డి, అనిత నర్సింలు, ఎస్సీ సెల్ లింగాల కృష్ణ, గ్రామ అధ్యక్షుడు బర్రింకల స్వామి, చిక్కుడు స్వామి, నర్స గౌడ్,జె. స్వామి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయి, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

The aim of the government is to make the farmer a king