ఆడబిడ్డల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆడబిడ్డల అభ్యున్యతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన బస్టాండ్ లో గురువారం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగిందని అన్నారు. ఆడబిడ్డల అభ్యున్నతి కోసం పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకుని...