Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 4:19 pm Posted by : ramakrishna

ఆడబిడ్డల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం

  • నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆడబిడ్డల అభ్యున్యతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రజా  విజయోత్సవాలలో భాగంగా  నగరంలోని ప్రధాన బస్టాండ్ లో గురువారం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగిందని అన్నారు. ఆడబిడ్డల అభ్యున్నతి కోసం పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకుని అభయం కల్పించామని తెలిపారు. మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆడబిడ్డలకు రూ.3900 కోట్లు ఆదా చేశామని తెలిపారు. గతంలో ఆర్టీసీ బస్సులోల 45శాతం మంది ప్రయాంణం చేసేవారని, ప్రస్తుతం పేద మహిళలలు 66శాతం మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో బస్సులు లేక ఇబ్బందులు పడేవారని, నేడు ప్రతీ గ్రామానికి బస్సులు వెళుతున్నయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్ఎం టి.జ్యోష్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఓ)ఎన్.సరస్వతి, అధికారులు పాల్గొన్నారు.

The aim of the Congress is the development of the girl child