విద్యారంగ సమస్యలపై పోరాటమే పీడీఎస్ యూ లక్ష్యం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్య రంగ సమస్యలపై నిరంతర పోరాటమే పీడీఎస్ యూ లక్ష్యమని విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ అన్నారు. పీడీఎస్ యూ 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు శుక్రవారం విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. తమ ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డి స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని, పెండింగ్ స్కాలర్ షిప్ లు, ఇతర...