Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 8:06 pm Posted by : ramakrishna

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం

  • రెవెన్యూ,వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలి
  • గన్ని సంచులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయి
  • జిల్లా కలెక్టర్ ఎం. హరిత

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఎం. హరిత స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, రవాణా, మార్కెటింగ్, సహకార, ఐకేపీ, మెప్మా ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలోని ఆడిటోరియంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 2,11,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించా మని, ఈ సీజన్లో దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా గ్రామాల్లో వరి కోతలు మొదలు అయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెంటనే ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే రైతులకు ధాన్యం కేంద్రాలకు ఎలా తరలించాలి? తేమ శాతం వివరాలు తెలిపి టోకెన్లు ఇవ్వాలని ఆదేశించారు. సన్న ధాన్యాన్ని నిర్ధారించి, దాని వివరాలు కొనుగోలు కేంద్రాల బాధ్యులకు ఇవ్వాలని సూచించారు. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం సేకరణ, రైతుల వివరాల నమోదు ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలగించాలని సూచించారు. ధాన్యం సేకరణ, రవాణా, లారీలు ఇతర ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం  గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2389,  కామన్ రకానికి రూ.2369 నిర్ణయించిదని వెల్లడించారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 అదనంగా ఇస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని సేకరించేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో 144, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కలిపి మొత్తం 231 ప్రారంభించనున్నట్లు తెలిపారు.

  • అందుబాటులో పరికరాలు..

జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. టార్పాలిన్లు 7592, తూకం వేసే యంత్రాలు 764, ప్యాడీ క్లీనర్లు 731, తేమ శాతం చూసే మెషిన్లు 603, గ్రైన్ కాలిపర్స్ 270 ఇతర యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ డీసీఎస్ఓ చంద్రప్రకాష్, జిల్లా మేనేజర్ రజిత  డీఏఓ అఫ్జల్ బేగం, డీఆర్డీఓ శేషాద్రి, డీసీఓ రామకృష్ణ, డీఎంఓ ప్రకాష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

The aim is to provide support prices to farmers