Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 5:44 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డిని స్మార్ట్ సిటీగా చేయడమే లక్ష్యం

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిని స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శనివారం రూ.5.15 కోట్ల టీయూఎఫ్ఐడిసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లారెడ్డి బస్ స్టాండ్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులు జరుగుతున్నాయని బస్ స్టాండ్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది అని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఎపుడు జరగని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

The aim is to make Ellareddy a smart city

బస్టాండు, మినీ ట్యాంక్ బండ్, హైవే నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే బస్టాండ్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఏ పనికి కూడా నిధులు ఆగకుండా ఎల్లవేళలా కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పనుల పురోగతిని తెలుసుకుంటున్నామన్నారు.  మంచి నాణ్యతతో నిర్మించాలని గుత్తెదారులను ఆదేశించామని తెలిపారు.  అధికారులకు యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపం జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వార్డ్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

The aim is to make Ellareddy a smart city