- సిపిఐ నాయకుల డిమాండ్
బతుకమ్మ, కోటగిరి : భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిపిఐ మండల కార్యదర్శి ఏ విట్టల్ గౌడ్ మాట్లాడుతూ… గత రెండు రోజుల ఎడతెరుపు లేకుండా కురిసిన భారీ వర్షాలు వలన పంట పొలాలు సోయా రైతులు నష్టపోవడం జరిగింది పోతంగల్ మండలం మంజీరా నది పక్కన ఉన్న గ్రామాలన్నీ నీటిలో మునిగిపోవడం జరిగిందని మంజీర ప్రాంతం పక్కనున్న పంటపొలాలు పూర్తిగా నష్టపోయారని అధికారులు పంట పొలాలను వెళ్లి సర్వే చేసి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరానికి 30000 చొప్పున ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది భారీ వర్షాల వలన రోడ్లు కొట్టుకుపోయాయని వెంటనే వాటిని పునర్దించాలని నీటిలో మునిగిపోయిన ఇల్లులోని ప్రజలకు ప్రభుత్వం నిత్యవసర సరుకులు వెంటనే పంపిణీ చేయాలని సహాయక చర్యలు చేపట్టి ఇటు ప్రజలను అటు రైతాంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లగంగాధర్ బుడాల రాములు నాగేష్ లాలయ్య భీమరావు తదితరులు పాల్గొన్నారు.