వీడిసి పేరుతో పెత్తందార్ల ఆగడాలను అరికట్టాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో భూస్వామ్య విధానం నుండి పెత్తందారి వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో విడిసిల పేరుతో దళిత,బహుజనులను,మైనార్టీలను గత పది సంవత్సరాల నుండి హింసిస్తున్న పరిస్థితి ఉందన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిఆర్ఎస్ నాయకుడు రామన్నపేటలో ఒక వ్యక్తి ఇల్లును జెసిబితో కూలగొట్టిన పరిస్థితి ...