Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 5:52 pm Posted by : ramakrishna

వీడిసి పేరుతో పెత్తందార్ల ఆగడాలను అరికట్టాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో  భూస్వామ్య విధానం నుండి పెత్తందారి వ్యవస్థ  గ్రామీణ ప్రాంతంలో  విడిసిల పేరుతో దళిత,బహుజనులను,మైనార్టీలను గత పది సంవత్సరాల నుండి  హింసిస్తున్న  పరిస్థితి ఉందన్నారు. గతంలో టిఆర్ఎస్  ప్రభుత్వం  ఉన్నప్పుడు  టిఆర్ఎస్ నాయకుడు  రామన్నపేటలో  ఒక వ్యక్తి  ఇల్లును జెసిబితో కూలగొట్టిన పరిస్థితి  అట్లాగే ప్రతి రోజు ఈ ప్రాంతంలోని గ్రామాలలో బడుగు,బలహీన  వర్గాలపైన కట్టుబాట్లతో   సాంఘిక బహిష్కరణ  గ్రామ బహిష్కరణలు  చేస్తున్న  పరిస్థితి చట్టాన్ని  న్యాయాన్ని  తమ చేతిలోకి  తీసుకొని  పోలీస్ వ్యవస్థను  న్యాయస్థానాలను కూడా  ధిక్కరించి  దాడులు చేస్తున్న  పరిస్థితి కనుక  గత ఐదు ఆరు మాసాలుగా  తాళ్లరాంపూర్  గ్రామంలో  గౌడ కులస్తులపై  కొద్ది మంది పెత్తందారులు,  వీడీసీ  పేరుతో వాళ్లు కొనుగోలు చేసిన భూములను  లాక్కోవాలని ఆలోచనతోనే  కుట్రలు కుతంత్రాలు  చేస్తూ  గ్రామీణ ప్రాంతాల్లో  ప్రజలను  బయన్దోలను  గురిచేస్తున్నారు. ఇలాంటి  వారిపై  కఠినంగా చర్యలు  తీసుకోకపోగా పోలీసులు   నిమ్మకు  నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.   అట్లాగే ఈ చర్యలను సభ్య  సమాజానికి తెలపడానికి   వెళ్లిన  జర్నలిస్టును కూడా  దాడి  చేసి కొట్టిన  వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకొని కఠినంగా  శిక్షించాలని  సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్  చేస్తున్నామన్నారు. ఈ ప్రెస్ మీట్లో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.ఓమయ్య  రాజేశ్వర్ జిల్లా నాయకులు సాయ గౌడ్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.