21వ ప్యాకేజీ పనులు పూర్తిచేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలో చేపట్టిన నిలిపేసిన కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులను వెంటనే పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  డిచ్ పల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా మంచిప్ప నుంచి గడ్కోల్ వరకు ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయని, గత రెండేళ్లుగా ఈ పనులు నిలిపేశారని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో...