Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 12:09 pm Posted by : ramakrishna

21వ ప్యాకేజీ పనులు పూర్తిచేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలో చేపట్టిన నిలిపేసిన కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులను వెంటనే పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  డిచ్ పల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా మంచిప్ప నుంచి గడ్కోల్ వరకు ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయని, గత రెండేళ్లుగా ఈ పనులు నిలిపేశారని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గడ్కోల్ సెగ్మెంట్లో మోపాల్, డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండల పరిధిలో 84,014 ఎకరాలకు సాగు నీరందించేందుక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మతలపెట్టిన మంచిప్ప ప్రాజెక్టును పదేళ్లలో పూర్తి చేయలేకపోయిందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి పంటలకు నీళ్లు అందించాలని  డిమాండ్ చేశారు. రూ.3వేల కోట్ల అంచనాతో పనులను ప్రారంభించింన బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించి పైప్ లైన్లు వేసింది, ప్రస్తుత ప్రభుత్వం మిగతా 1500 కోట్లు విడుదల చేస్తే పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో దేవస్వామి, అగ్గు చిన్నయ్య, న్యూడెమోక్రసీ డిచ్ పల్లి కార్యదర్శి గంగాధర్,బన్సీ, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.