ఆ ఈఈకి అదనపు బాధ్యతలు వద్దు
ఎమ్మెల్యే హుకుంతో నిలిచిపోయిన బాధ్యతల స్వీకరణ నీటిపారుదల శాఖలో వెక్కిరిస్తున్నఖాళీలు వర్షాకాలంలో శాఖకు తప్పని తిప్పలు బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల శాఖను ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దానికి తోడు రిక్రూట్ మెంట్ లేకపోవడంతో ఇంచార్జిలుగా ఉన్నఅధికారులకే బాధ్యతలను అప్పగిస్తున్నారు. అయితే అందులోనూ రాజకీయ జోక్యం పెరుగడంతో ఇంచార్జిలుగా చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి బాధ్యతలు అప్పజేప్పేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. అందుకు నిజామాబాద్ జిల్లాలో వెక్కిరిస్తున్న ఉన్నతాధికారుల ఖాళీ పోస్టులే నిదర్శనమని చెప్పాలి. నిజామాబాద్ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ పరిధిలో...