మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కరీంనగర్ కు చెందిన రంగ ప్రవీణ్ తన దయ హృదయంతో విద్యార్థులకు టై, బెల్ట్ లను శుక్రవారం బహుకరించారు. దీంతో పాఠశాల విద్యార్థులు దాతకు ధన్యవాదాలు అంటు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.