జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు : గడుగు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు ,జిల్లా రైతాంగం వ్యవసాయ కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని రైతుల పక్షపాతి సీఎం జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు. తాను సైతం జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పలుమార్లు వ్యవసాయ కళాశాల గురించి విజ్ఞప్తి...