Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 2:03 pm Posted by : ramakrishna

జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు : గడుగు

 నిజామాబాద్, బతుకమ్మ :  జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి  రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు ,జిల్లా రైతాంగం వ్యవసాయ కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని రైతుల పక్షపాతి   సీఎం జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు. తాను సైతం జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పలుమార్లు వ్యవసాయ కళాశాల గురించి విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లాకు వ్యవసాయ కళాశాల తేవడంలో ఆయన పాత్ర కూడా ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు  వ్యవసాయ కళాశాల మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి  , జిల్లా నాయకులకు వ్యవసాయ కళాశాల జిల్లాకు మంజూరైనందున ధన్యవాదాలు తెలిపారు.