వినాయక ఉత్సవాలకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి విమజ్జనం వరకు నిర్వాహణకు సహకరించిన ప్రతీఒక్కరికి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కృతజ్ఞతలు తెలిపారు. కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకున్నారన్నారు. కమిషనరేటు పరిధిలో దాదాపు 6000 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించారని తెలిపారు. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9, 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో...