రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల గ్రామపంచాయతీకి సంబంధించిన 2026 -27 సంవత్సరానికి తై బజార్ (వారసంత), పశువధ (మస్లక్) వేలంపాట మార్చి 26 గురువారం ఉదయం 11:00 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటలో పాల్గొనే వారు తై బజార్ 45,000 రూపాయలు, పశువద 10,000 రూపాయలు డిపాజిట్లు చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు.