లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్పీడీసీఎల్ అదనపు సహాయ ఇంజనీర్
సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో అదనపు సహాయ ఇంజనీర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న బి. రామకృష్ణ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి కారుతో ఈ నెల 12వ తేదీన జరిగిన ప్రమాదంలో విద్యుత్ స్తంభం దెబ్బతిన్న ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారికి లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రూ.25,000 లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం సుమారు...