Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 7:39 pm Posted by : ramakrishna

టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన టీజీఆరజేసీ సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షకు 7483 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6564మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 919 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.