బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు

హైదరాబాద్, బతుకమ్మ :  గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా  నోటీసులు పంపింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది.  సమాధానం చెప్పలేని పక్షంలో పరువునష్టం, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది.