నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్నికలను అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, కామారెడ్డి డీటీవో కే. శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. 5వ తేదీన ఉదయం 9గంటలకు నిజామాబాద్ టీఎన్జీవో భవనంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఎన్నికలను అదే రోజున పూర్తి చేస్తామని ఎన్నికల అధికారి ప్రకటనలో తెలిపారు.