ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్ కు టీజిఓ సంఘం వినతి పత్రం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజిఓ సంఘం ఆధ్వర్యంలో వివిధ ఎన్నికలలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, అధికారులకు ఒక నెల గౌరవ వేతనంను వెంటనే ఇప్పించాలని టీ.జి.ఓ. సంఘం అధ్యక్షులు అలుక కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్ సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సానుకూలంగా స్పందించారు. వెంటనే సెక్షన్ ఆఫీసర్‌తో ఈ విషయాన్ని సమీక్షించి, ఆలస్యం చేయకుండా ప్రధాన ఎన్నికల అధికారి కి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో తీసుకున్న త్వరిత చర్యను...