ఇతరులకు మార్గదర్శకంగా టీజీవో సంఘం

అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ టీజీవో సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఇఫ్తార్ విందు   నిజామాబాద్, బతుకమ్మ: గజిటెడ్ అధికారుల సంఘం ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుందని, ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుందని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్  జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో ఇఫ్తార్  విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్...