Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 4:52 pm Posted by : ramakrishna

హెచ్ సీ యూ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ తెయూ బంద్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల అమ్మకాన్ని నిరసిస్తూ తెయూ బంద్ నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దహయం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను టార్గెట్ చేస్తూ విద్యావ్యవస్థను టార్గెట్ చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, మేధావులంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నియంతల వ్యవహరిస్తూ యూనివర్సిటీ భూములను అమ్మడం ఎంతో దారుణమని అన్నారు. మా భూములు అమ్మొద్దు మా యూనివర్సిటీ భూములను కాపాడాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పైన పోలీసులను పెట్టి మహిళల పైన దాడులు చేయడం ఎంతో సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి హైదరాబాద్

Teyu bandh to protest sale of HCU lands

సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడి అక్కడున్న వన్యప్రాములను కాపాడి విద్యా వ్యవస్థను బాగు చేయాలని యూనివర్సిటీ లను గాడిలో పెట్టాలి అని వారు కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థులకు యూనివర్సిటీకి న్యాయం చేయాలని లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మర్చిపోయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నాడని,విద్యార్థులకు న్యాయం చేయడం ఆపేసి ప్రైవేటు వ్యక్తులకు యూనివర్సిటీ భూమిని కట్టబెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి  పేదలన్న పేద విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీలు అన్న చిన్న చూపు అని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే కుట్ర తోటే రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులమంతా ఏకమై విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించి యూనివర్సిటీకి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ జాయింట్ సెక్రటరీ సమీర్, అశోక్, అజయ్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు అనిల్, యూనివర్సిటీ నాయకులు పృద్వి, రోహన్, నరేందర్, రమణ, ఉదయ్, సాయి, కౌశిక్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Teyu bandh to protest sale of HCU lands