Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 6:23 pm Posted by : ramakrishna

రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మెళనం కు తరలిన తెయూ విద్యార్థులు

ఎబివిపి విద్యార్థుల చలో కాకతీయ…

 డిచ్ పల్లి, బతుకమ్మ :

ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం( కాకతీయ యూనివర్సిటీ ) లో జరుగనున్న నేపథ్యంలో చలో కాకతీయ అని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు బయలు దేరి వెళ్లారు. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, ఇందూర్ విభాగ్ ప్రముఖ్  రేంజర్ల నరేష్ చలో కాకతీయ ను జెండా ఊపి ప్రారంభించారు..

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని,నిరంతరం విద్యార్థుల కోసం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు. ఈనెల 22 23 రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనానికి తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు తరలి వెళ్లడం ఎంతో సంతోషకరమని అన్నారు.విశ్వవిద్యాలయాల అభ్యున్నతి కోసం దేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని,అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎంతో శ్రమిస్తుందని అన్నారు.విశ్వవిద్యాలయాల్లో జాతీయ భావానికి అడ్డాగా ఏబీవీపీ నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం యువత అంతా జాతీయ భావం పైపు ఉన్నారని వారు అన్నారు. కాకతీయ యూనివర్సిటీ లో జరుగుతున్న ఈ విశ్వవిద్యాలయాల సదస్సు యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.సమాజం గురించి,సమకాలీన అంశాలపై,యూనివర్సిటీ వ్యవస్థపై అనేక అంశాలపై ఈ విద్యార్థుల సమ్మేళనంలో  చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ  జాతీయ కార్యవర్గ సభ్యులు,ఇందూరు విభాగ్ సంఘటన కార్యదర్శి కుంట హర్షవర్ధన్,పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి,విభాగ్ కన్వీనర్ శశి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్,యూనివర్సిటీ నాయకులు   అశోక్ అక్షయ్ అజయ్ శివకుమార్ దుర్గా దాస్ మనోజ్ మహర్షి సాయినాథ్ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.