Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 4:46 pm Posted by : ramakrishna

పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి సమస్యను పరిష్కరించాలి

. . . కేంద్ర విద్యా శాఖ మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి

 వెబ్ డెస్క్, బతుకమ్మ :

చాలా ఏళ్లుగా ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తెచ్చిన అర్డినెన్స్ విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కోరారు. డిల్లీలో శుక్రవారం నిజామాబాద్ ఎంపి అర్వింద్ ధర్మపురి పార్లమెంట్‌ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి, ఇటీవల వచ్చిన  టెట్  తప్పనిసరి నిర్ణయం గురించి లేఖ సమర్పించారు.ఈ నిర్ణయం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన దాదాపు 3000 మంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపుతుందని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమస్యను పరిశీలించి, చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి ని  కోరారు.