వెబ్ న్యూస్, బతుకమ్మ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) హాల్ టికెట్లను శనివారం విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు విడుతల వారీగా ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1,2 లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వీస్ లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కేజీబీవీ లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో కలిపి దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.