Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 9:18 am Posted by : ramakrishna

15న ఇండియాలో టెస్లా షోరూం ప్రారంభం

ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో..

పోస్టర్ విడుదల చేసిన కంపెనీ

వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాలో తన షోరూంను ఈనెల 15న ప్రారంభించనుంది. తన మొదటి షోరూంను ముంబైలో ప్రారంభించబోతున్నట్లు ఆ కంపెనీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో తన మొదట ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది….మొత్తానికి భారత్ లో ఎలాన్ మస్క్…అతని టెస్లా కంపెనీ అడుగుపెడుతోంది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబాయ్ లలో తమ సంస్థలలో పనిచేసేందుకు లింక్ఢ్ ఇన్ వేదికగా టెస్లా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి షోరూమ్ ను ఈ నెల ముంబైలో  ప్రారంభించనున్నారు. టెస్లా ఎంట్రీతో భారతీయ ఈవీ రంగం మరింత వేగవంతమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.