వెబ్ న్యూస్, బతుకమ్మ: ఇండియన్ మార్కెట్ లోకి టెస్లా వచ్చేసినట్టేనని బిజినెస్ వర్గాలు అంటున్నారు. కొన్నేళ్లుగా భారత్ మార్కెట్ లోకి టెస్లా వద్దామనుకుంటున్న సంగతి తెలిసింది. దిగుమతి పన్ను ను తగ్గించాలని ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. కాగా ఇండియాలోనే కార్లను తయారు చేయాలని, ఇక్కడి కంపెనీలు తయారు చేసే స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయాలని కేంద్రం షరతులు పెట్టడంతో ఎలన్ మస్క్ ఒప్పుకోలేదు. ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాన మోదీతో ఎలన్ మస్క్ భేటీ అయ్యి సుంకాల అంశాలపై చర్చించారు. ఆ తరువాత ఇండియాలో టెస్లా నియామకాలు ప్రారంభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే భారత్ రోడ్లపై టెస్లా కార్లు దర్శనమిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.