వెబ్ న్యూస్, బతుకమ్మ : పహాల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బీహర్ లోని పాట్నాలో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీశారని అన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఇది పర్యాటకం మీద జరిగిన దాడి కాదని, భారత్ పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.