పోలీసులు అదుపులో నిందితులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ సెక్రటేరియేట్ పై ఇద్దరు అగంతకులు డ్రోన్ ఎగురవేశారు. ఈఘటన మార్చి 11 రాత్రి జరగడంతో అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రోన్ ఎగరేసిన ఇద్దరిని వంశీ, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఈమేరకు వారిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో వారు సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియాను చిత్రీకరించారు.