Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 7:50 pm Posted by : ramakrishna

బోధన్‌లో ఉగ్రవాదుల కలకలం 

  • నకిలీ పాస్‌పోర్టులు, ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా..?

 

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్: బోధన్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది. పట్టణంలోని అనీస్ నగర్‌కు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి ఒక గన్ను, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో రోహింగ్యాలు, నకిలీ పాస్‌పోర్టుల ఉడంతాలు వెలుగుచూసిన బోధన్ ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితుడిని పోలీసులు బోధన్ కోర్టులో హాజరుపరిచారు. స్థానిక పోలీసులకు వివరణ కోరగా మాకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు అని తెలియజేశారు.