Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 4:19 pm Posted by : ramakrishna

అర్ధరాత్రి దొంగల బీభత్సం

బతుకమ్మ,వేల్పూర్: మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో బుధవారం రాత్రి ఆర్మూర్ రుక్మ బాయ్ అనే మహిళ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. బాధితురాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమె కోడలితో నిజామాబాద్ హాస్పిటల్లో ఉండడంతో ఇంటికి తాళం వేసిన విషయాన్ని పసిగట్టిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామపంచాతీ ఉద్యోగులు గురువారం ఉదయం ఆమె ఇంటి వద్ద పనులు చేస్తూ ఆమెకు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటిన వచ్చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బాధితురాలు రుక్మాబాయి మాట్లాడుతూ మొత్తం 16 తులాల బంగారం, 25వేల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు తెలియజేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.