పదో వార్డు సమస్యలను పరిష్కరించాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత నిజామాబాద్, బతుకమ్మ : నాగారంలోని 10వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడారు. ఈ సమస్యను వార్డు కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి గతంలో చాలా సార్లు తీసుకువెళ్లామని తెలిపారు. నాగరానికి చెందిన 10వ వార్డులోని టైలర్స్ కాలనీలో మురికి నీరు ఎక్కడికక్కడ నిలువ ఉండడం వల్ల అక్కడే ఉంటున్న దాదాపు ఒక...