. . . ఏఐఎస్ బీ ఆధ్వర్యంలో ఆర్మూర్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
ఆర్ముర్, బతుకమ్మ :
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా చర్యలు చేపట్టి నిర్వహించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, సూర్య పాల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ కలెక్టర్ కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి జరగబోయే టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, విద్యార్థులకు వారి పరీక్ష కేంద్రాలలో తగిన మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు. పరీక్ష కేంద్రాలలో వేసవి కాలం దృష్ట్యా మంచి నీళ్ల సౌకర్యం కల్పించాలని, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్స్ ఉండే విధంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. పరీక్ష సమయాలలో విద్యుత్ అంతరాయం జరగకుండా సంబందిత అధికారులతో మాట్లాడి పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలని వారు కలెక్టర్ ని కోరారు.